ముగిసిన సింగరేణి ఎన్నికలు.. 95 శాతం ఓటింగ్ నమోదు

-

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో సింగరేణి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కోసం 84 పోలింగ్‌ కేంద్రాలు, 11 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపపడ్డాయి. ఈ ఎన్నికల్లో 95 శాతం ఓటింగ్ జరిగింది. సింగరేణి వ్యాప్తంగా 39,773 కార్మికులు ఉండగా.. 37,447 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బెల్లంపల్లి ఏరియాలో 96.29 శాతం.. , మందమర్రిలో 93.38 శాతం, శ్రీరాంపూర్ లో 93.03, కార్పొరేట్ లో 96.14 శాతం, కొత్తగూడెంలో 94.88 శాతం, ఇల్లందులో 98.37 శాతం, మణుగూరులో 97.06, ఆర్జీ 1 93.68 శాతం, ఆర్జీ2లో 94.74 శాతం  పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version