మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర ప్రారంభం

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జవంలో భాగంగా యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. సంగెం దగ్గర భీమలింగంకు పూజలు చేసిన అనంతరం  పాదయాత్ర ప్రారంభం అయింది. సంగెం వద్ద మూసీ నదిలో నీటిని పరిశీలనకు తీసుకొని శాంపిల్స్ పరిశీలించారు. వాటిని ల్యాబ్ కు పంపించనున్నట్టు సమాచారం.

సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం పర్యటన కోసం 2వేల మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్ బాబు తెలిపారు. సంగెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భీమలింగం-ధర్మారెడ్డి పాలెం కెనల్ గుండా సాయంత్రం నాగిరెడ్డి పాలెం చేరుకొని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version