రుణమాఫీ చేస్తామంటే నమ్మబుద్ధి కావట్లేదు – జీవన్ రెడ్డి

-

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేసీఆర్ కి రైతు రుణమాఫీ గుర్తు రావడం సంతోషకరం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 36 వేల లోపు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. విడతల వారిగా రుణమాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిందని.. ఈ లోపు రైతులకు వడ్డీ భారీగా పెరిగి పోయిందన్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ అనే బదులు రైతు వడ్డీ మాఫీ అనాలని ఎద్దేవా చేశారు.

రైతు బంధు ఆరు ఎకరాల లోపు మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. ఎకరానికి ఐదు వేలు రైతు బందు ఇవ్వట్లేదని.. అలాంటిది రుణమాఫీ చేస్తాం అంటే నమ్మబుద్ది కావట్లేదన్నారు జీవన్ రెడ్డి. రైతులకు ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లిందన్నారు. సెప్టెంబర్ వరకు రుణమాఫీ చేస్తాం అంటున్నారని.. ఆ లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. అప్పుడు ఎన్నికల తర్వాత చేస్తాం అని మళ్ళీ చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version