వచ్చే డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది – రేవంత్‌ రెడ్డి

-

వచ్చే డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్, మోడి లది ఫెవికల్ బంధం అని విమర్శలు చేశారు. ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని..మళ్లీ గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాడని సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరారు జూపల్లి కృష్ణారావు. ఢిల్లీలోని మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరుగుతోందని.. కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రాష్ట్రాన్ని కేసీఆర్ ఫణంగా పెట్టారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ముమ్మరం చేసిందని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఆకాంక్షలు నెరవెరుస్తుందని నమ్ముతున్నారన్నారు. సీనియర్ల తో పాటూ కొత్తగా చేరిన వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version