మందమర్రిలో అమానుషం..మేకల దొంగతనం పేరుతో వేలాడదీసి కొట్టారు!

-

మందమర్రిలో అమానుషం చోటు చేసుకుంది. మేకల దొంగతనం పేరుతో ఇద్దరు యువకులను వేలాడదీసి కొట్టారు గ్రామస్థులు. అయితే.. మేకల దొంగతనం ఆరోపణలతో దళిత యువకులపై దాడికి పాల్పడిన వ్యక్తుల పై 307 IPC, SC/ST (Prevention of atrocities) Act 1989 కేసు నమోదు చేశారు పోలీసులు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములకు చెందిన మేకల మంద నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది. దీంతో దళితులైన చిలుముల కిరణ్‌, మరో వ్యక్తిని కొట్టారు.

ఈ కేసులో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ…దళితుల పై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల 30 వ తేదీన ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలలో “సివిల్ రైట్స్ డే” నిర్వహించి ప్రజలకు కుల వివక్ష, చట్టలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎదుటివారి హక్కులకు ఎలాంటి భంగం కల్గించడం, కుల వివక్ష చూపడం, దాడులకు పాల్పడడం అనేది చట్టారీత్యా నేరం అని దానికి ఎవరైనా పాల్పడిన, వారికి సహకరించిన, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రోత్సహించె వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version