పెళ్లికి బాజా మోగింది.. ఈనెల 17, 18 తేదీల్లో వేలాది వివాహాలు

-

శ్రావణమాసం వచ్చేసింది. శుభముహూర్తాలు తెచ్చేసింది. మూడున్నర నెలల విరామం తర్వాత మూడు ముళ్ల బంధానికి స్వాగత ద్వారాలు తెరచుకున్నాయి. ఏప్రిల్‌ 28 నుంచి శుక్ర మూఢమి, దానికి తోడు గురు మూఢమి రావడంతో శుభకార్యాలకు అవాంతరం ఏర్పడింది. ఇక ఇవాళ్టి నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచి 28వ తేదీ వరకూ శుభకార్యాలకు ముహూర్తాలున్నాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను ఈ నెలలో ఎక్కువగా నిర్వహించనున్నారు. మరి ఈ నెలలో ఏయే రోజులు శుభకార్యాలకు మంచిరోజులో ఓసారి చూసేద్దామా?

ఆగస్టు 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24 తేదీలతోపాటు 28న ఈ నెలకు చివరి ముహూర్తం. 17, 18 తేదీల్లో అత్యంత శుభ ముహూర్తాలు. ఈ నేపథ్యంలోనే ఈ రెండ్రోజుల్లో ఏపీలో వేలాది శుభాకార్యాలున్నాయి. ముఖ్యంగా వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సుముహూర్తాలు రావడంతో పురోహితుల నుంచి విద్యుత్తు అలంకరణ, కల్యాణ మండపాలు, బాజా భజంత్రీలు, బ్యుటీషియన్లు, షామియానా, వంటమేస్త్రీలు, క్యాటరింగ్‌ తదితర రంగాల వారికి చేతినిండా పని దొరుకనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version