మేడిగడ్డ ఘటనపై మూడు కేసులు

-

రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనలో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ బ్యారేజీ కుంగుబాటు, పియర్స్‌ దెబ్బతినడంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రాథమికంగా మూడు కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.

నిర్మాణ సంస్థ ఎల్ అండ్‌ టీతో పాటు ఇటీవల కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా తొలగించిన వెంకటేశ్వర్లుపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన కారణాలను కూడా విజిలెన్స్ అధికారులు సర్కార్కు వివరించినట్లు సమాచారం. సీఐడీ ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ మంగళవారం రోజున సంబంధిత అధికారులతో చర్చించి  3 కేసుల నమోదుకు గల కారణాలను వివరంగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సిఫార్సు చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version