Etela Rajender: మల్కాజ్‌గిరి టికెట్ ఈటల రాజేందర్‌కు ఖరారు !

-

Etela Rajender : మల్కాజ్‌గిరి టికెట్ ఈటల రాజేందర్‌కు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే మల్కాజ్‌గిరి టికెట్ తనకు ఖరారు అయిందని ఈటల రాజేందర్‌ చెప్పుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇవాళ పొద్దున్న శామీర్ పేట లోని ఈటెల నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ కోసం బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించారు.

BJP Ex MLA Etela Rajender Demanding Malkajgiri MP Ticket on BJP Hi Command

ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ప్రకటించకుండా కేవలం ఈటల రాజేందర్‌కు మాత్రమే ఎలా ప్రకటిస్తారు అని అయోమయంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారట. మరి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ పూర్తి స్థాయిలో వస్తే క్లారిటీ వస్తుంది. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ కు ఘోర పరాభవం ఎదురైంది. గజ్వేల్‌, హుజురాబాద్‌ నియోజక వర్గాల్లో ఈటల రాజేందర్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు మల్కాజ్‌ గిరి ఎంపీ బరిలో ఉన్నారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version