తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతుల కోసం అందుబాటులోకి వాట్సాప్ సేవలు తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి కొనుగోళ్లు, ఏర్పాట్ల పై మార్కెటింగ్ సంచాలకులు, అధికారులతో సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.
మార్కెట్ కు మరియు జిన్నింగ్ మిల్ కి వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు వాట్స్ యాప్ సేవలు (8897281111) వెటింగ్ టైం, పేమెంట్ స్టేటస్, కంప్లైంట్ ఫోరమ్, మార్కెట్, జిన్నింగ్ మిల్ లిస్ట్ జిల్లా వారీగా ఇతర అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని కోరారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లా అధికారులు సెక్రేటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.