తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బిగ్ రిలీఫ్ వచ్చింది. జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి మంజూరైన బెయిల్ వచ్చింది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
ఇద్దరి పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన కోర్టు…సాక్షులను ప్రభావితం చేయవద్దని… సాక్ష్యాలను చేరిపివేయవద్దని షరతులు విధించింది. ఈ తరుణంలో…కరీంనగర్ జైలుకు సంజయ్ బెయిల్ పత్రాలు అందజేశారు. ఇక ఇవాళ మధ్యాహ్నం వరకు సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. టెన్త్ పేపర్ లీకేజీ లో మంగళవారం సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. బండి సంజయ్ తన వాట్స్అప్ ద్వారా పేపర్ లీక్ చేసినట్లు.. తేల్చిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.