తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఇవాళ 7వ రోజు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ 2024 (సవరణ) బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2024, పంచాయతీ రాజ్ బిల్లు 2024, భూ భారతి బిల్లును మండలిలో ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం.
అదేవిధంగా రైతు భరోసా పై శాసన మండలిలో స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. ఇప్పటికే అసెంబ్లీలో భూ భారతి, పంజాయతీ రాజ్ బిల్లులు అసెంబ్లీలో ప్రవేవపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేసీ వాయిదా తీర్మాణాన్ని ఇచ్చాయి. రైతు భరోసా, భూ భారతి బిల్లు పై అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోనుంది ప్రభుత్వం ఈ అభిప్రాయాల మేరకు నడుచుకోనుంది.