మ‌త ప‌ర‌మైన దాడుల‌ను స‌హించం : సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో మ‌త ప‌ర‌మైన దాడుల‌ను స‌హించ‌మ‌ని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం లో అన్ని మ‌తాల వారికి రక్ష‌ణ ఉంటుంద‌ని తెలిపారు. కాగ ఈ రోజు హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మ‌స్ వేడుకల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్ కేక్ క‌ట్ చేసి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ లో అన్ని మ‌తాల ప్ర‌జ‌లు స‌మానం అని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున బోనాలు, రంజ‌న్, క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌ర‌పాల‌ని త‌న‌ను ఎవ‌రూ కోర‌లేద‌ని అన్నారు.

అన్ని మ‌తాల‌ను గౌర‌వించాల‌నే ఉద్ధేశంతో త‌మ ప్ర‌భుత్వం చేస్తుంద‌ని అన్నారు. అలాగే మ‌త ఉన్మాద స్థాయికి చేరితే ప్ర‌మాద‌మ‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మ‌త ప‌ర‌మైనచ దాడులు చేస్తే స‌హించమ‌ని అన్నారు. అలాగే ఏసు దీవ‌న‌ల‌తో రాష్ట్రం, దేశం చ‌ల్ల‌గా ఉండాల‌ని కోరారు. అలాగే రాష్ట్రంలో గ‌త ఏడాది క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉండ‌టం వల్ల క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌ర‌పుకోలేక పోయామ‌ని అన్నారు. కరోనా వైర‌స్ నుంచి దేశం బ‌య‌ట ప‌డాల‌ని ఏసు ను ప్రార్థిస్తున్న‌ట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version