రేపు, ఎల్లుండి తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు జరుగున్నాయి. ఈ మేరకు 5 లక్షల 51 వేల మంది ఈ ఎగ్జామ్ కి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం. మార్చి చివరి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం.
18, 19 తేదీల్లో సర్వీస్ కమిషన్ డిల్లీకి పర్యటన చేస్తామని…. జాతీయ స్థాయి రిక్రూట్ మెంట్ ఏజెన్సీ లను కలుస్తామని తెలిపారు. 18 న యూపీఎస్సీ కి వెళతామని.. ఆ తరవాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను కలుస్తామన్నారు. 19 న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఛైర్మన్ ను, ఆ రోజు సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ను కలుస్తామని… జనవరి చివరి నాటికి ప్రభుత్వానికి మా యాక్షన్ ప్లాన్ ఇస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు తెలంగాణ సర్వీస్ కమిషన్ ను సందర్శించాలని అనుకుంటున్నాయి… నియామక ప్రక్రియ ఏదైనా గరిష్టంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేయాలని ప్లాన్ అన్నారు.