నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్లో ఇవాళ పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 వరకు చెంగిచర్ల, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్‌ వైపునకు వచ్చే వాహనాలు హెచ్‌ఎండీఏ భగాయత్‌ లేఅవుట్‌ మీదుగా నాగోల్‌ వైపు వెళ్లాలని సూచించారు.

ఎల్బీనగర్‌, నుంచి నాగోల్‌ మీదుగా ఉప్పల్‌కు వచ్చే వాహనాలు నాగోల్‌ మెట్రోస్ట్టేషన్‌ వద్ద టర్న్‌ తీసుకొని భగాయత్‌ లే అవుట్‌ మీదుగా బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ మీదుగా నాచారం, మల్లాపూర్‌ వైపు వెళ్లాలని చెప్పారు. వాహనాదారులు ఈ సూచనలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తరుణ్ జోషి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version