ఈరోజు సాయంత్రం 4-8 గంటల వరకు హైదరాబాద్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రధాని బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి షాపర్‌స్టాప్‌, హెచ్‌పీఎస్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్‌ వద్ద ఎడుమ వైపు రాజీవ్‌గాంధీ విగ్రహం, యశోద ఆసుపత్రి, రాజ్‌భవన్‌,  ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని,  రవీంద్రభారతి కూడలి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ మీదుగా ఎల్బీ స్టేడియానికి వెళ్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి ఈ మార్గంలోనే ప్రయాణం అవుతారని పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఏఆర్‌ పెట్రోల్‌ పంపు జంక్షన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వైపు అనుమతించకుండా నాంపల్లి వైపు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ, జీపీవో అబిడ్స్‌ సర్కిల్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్డు వైపు మళ్లించనున్నట్లు చెప్పారు. సుజాత స్కూల్‌ లేన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ భవన్‌ వైపు నుంచి ట్రాఫిక్‌కు నో ఎంట్రీ. నాంపల్లి వైపు .. రవీంద్రభారతి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఎల్బీ స్టేడియం మెయిన్‌ గేట్‌ ముందు, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version