సైబరాబాద్ లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సేవలు ప్రారంభం

-

సైబరాబాద్ పోలీస్ కమిషనర్  స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఈరోజు జెండా ఊపి ట్రాఫిక్ టాస్క్ కోర్స్ వాహనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ. . సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా సైబరాబాద్పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు.సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ పని చేస్తుందన్నారు.

ఈ టాస్క్ ఫోర్స్ కోసం ఆరు మోటార్ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించామన్నారు. ఒక్కో బైక్ పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్ ఫోర్స్ లో చేస్తారన్నారు. వీరికి ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారి ఇంచార్జ్ గా ఉంటారన్నారు.పీక్ అవర్స్ లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్ ఫోర్స్ టీం లు పెట్రోలింగ్ తిరుగుతుంటాయి. ఈ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. వీరు ముఖ్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (PAS) ద్వారా ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version