Telangana: ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా..50 మంది ప్రయాణికులు

-

Telangana: ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో 50 మంది ప్రయాణికులు ఉండగా సగం మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది.

Travels private bus overturned

ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలు కాగా , ఇద్దరి పరిస్థితి విషమం ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్ పట్టణానికి చెందిన ఫర్హనా అనే 28 సం.ల మహిళ మృతి చెందింది. అటు క్షతగాత్రులను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version