BRS ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు

-

బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. పార్థసారథికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేసింది. ఈ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా పార్థసారథి రెడ్డి ఉన్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఖానామెట్‌ వద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించిన జీవోను సవాల్‌ చేస్తూ 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

రైట్‌ సొసైటీతో పాటు ఊర్మిళ, సురేశ్‌ కుమార్ పిల్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. భూ కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా దీనిపై పునఃపరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version