టికెటేతర సంపాదనపై టీఎస్ఆర్టీసీ దృష్టి.. కార్గో ఆదాయ లక్ష్యం రూ.300 కోట్లు!

-

కరోనాతో కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ ఆ తర్వాత వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు, వినూత్న కార్యక్రమాలు చేపడుతూ నెమ్మదిగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇక గాడిన పడిందనుకుంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. దీంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో టికెటేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై టీఎస్‌ఆర్టీసీ దృష్టి సారించింది.

ఈ క్రమంలోనే ప్రైవేటు సంస్థలతో పోటీ పడేందుకు కార్గో, పార్సిళ్లను పెంచుకునేందుకు తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఏటా రూ.300 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఆర్టీసీ ఇందులో భాగంగా ఇప్పటికే సంస్థలో లాజిస్టిక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ తాజాగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంతో పాటు సీసీఎస్‌, పీఎఫ్‌ రూపంలో భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టికెటేతర ఆదాయం పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్దివారాల కిందట ఆర్టీసీకి గట్టి సూచన చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version