మెదక్ లో పెను ప్రమాదం..సిలిండర్ పేలి ఇద్దరు మృతి

-

మెదక్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వారం కిందట జరుగగా.. ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ. మెదక్‌ వెల్దుర్తి ( మం ) ఉప్పు లింగాపూర్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ నెల 13 న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Two killed in cylinder explosion

గాయపడిన వారిలో వీరమణి, పాండు, శ్యామల, వరలక్ష్మీ ఉన్నారు. అయితే.. ఈ వీరమణి, పాండు, శ్యామల, వరలక్ష్మీ నలు గురిని ఈ నెల 13 న ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ తరుణం లోనే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు వీరమణి, పాండు. అటు ఆస్పత్రిలో శ్యామల, వరలక్ష్మీ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దీనికి వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version