దసరా తర్వాతనే కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా

-

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దసరా అనంతరం అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వనపర్తి, సూర్యపేట, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపు కొంత క్లిష్టంగా మారిందని చెబుతున్నారు.

62 Congress candidates finalized

మరోవైపు సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు, సిపిఎంకు మిర్యాలగూడతో పాటు మరోస్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే బుధవారం లేదా గురువారం (అక్టోబర్ 25 లేదా 26) కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులను ఫైనల్‌ చేయనున్నారు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు.

అంటే.. దసరా తర్వాతనే కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా రానుందన్న మాట. నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా నేడు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు పూర్తిచేసి తొలి జాబితా రూపొందించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version