అభివృద్ధిని ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక మార్పులు తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో వెనుకపడిపోయిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ పై విరుచుకుపడుతుండగా.. కాంగ్రెస్ నుంచి మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. 

Bhatti Vikramarka

తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణ పై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికే రూ.10వేల కోట్లు కేటాయించామని.. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరూ కాకుల్లా అరుస్తున్నారని మండిపడ్డారు. పని లేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదన్నారు. మూసీ నిర్వాసితులకు వ్యాపార రుణాలు ఇస్తామని వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version