ప్రకాష్ రాజ్ ఓ బఫూన్…. మా ఎన్నికల్లో ఓడిపోయాడు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  రాహుల్ గాంధీ టూర్ జోష్ నింపింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలకు, నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్థేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులపై హామీల వర్షం కురిపించాడు. దీంతో ఇన్నాళ్లు టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు ఒక్కసారిగా తొలిగిపోయి… అంతా ఒక్కతాటిపైకి వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ టూర్ పై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా విమర్శలను ధీటుగా ఎదుర్కొంటోంది. 

తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై ధ్వజమెత్తాడు. గాంధీ కుటుంబం మీద మాట్లాడే గొప్పోడా కేటీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పనిచేసే వారికే ఈసారి టికెట్లు ఇస్తామని ఉత్తమ్ అన్నారు. ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన అన్నారు. ప్రకాష్ రాజ్ బఫూన్ అని విమర్శించాడు. అంత మొనగాడు అయితే మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు. 200 మంది ఉన్న ‘ మా’ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి కేసీఆర్ మెప్పుకోసం మాట్లాడుతున్నాడని విమర్శించాడు. రాజ్యసభ సీటు కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version