ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు : కేసీఆర్

-

బాల్కొండ నియోజకవర్గంలో మోతె గ్రామానికి ప్రత్యేక స్థానముంది. మోతె గ్రామం యొక్క మట్టిని హైదరాబాద్ కి తీసుకెళ్లాం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. ఇంకా మేచురిటి పెరగడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ బెదిరించాడు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 10 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమా అవుతున్నాయని తెలిపారు. దేశం మొత్తంలో చిన్న వయస్సు ఉన్న రాష్ట్రం తెలంగాణది.

ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటుంది. 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేసిందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డ వ్య‌క్తి గురించే కాదు.. ఆ అభ్య‌ర్థి వెనకున్న పార్టీ చ‌రిత్ర చూడాలి అని కేసీఆర్ సూచించారు. అల‌వోక‌గా, ఆషామాషీగా ఓటు వేస్తే కింద‌మీద అవుతుంది. మంది మాట‌లు ప‌ట్టుకుని మారువానం పోతే మ‌ళ్లొచ్చే వ‌ర‌కు ఇల్లు కాలిపోయింద‌ని అన్న‌ట్టు ఆగ‌మాగం అయిపోత‌ది. కాబ‌ట్టి ఓటు చాలా విలువైంది.. దాని ప్ర‌భావం ఐదేండ్ల భ‌విష్య‌త్‌పై ఉంట‌ది కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా వాడాలి. అన్ని వ‌ర్గాల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాం. స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్కారం చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version