ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్రెడ్డి కుమారుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి రూ.50 లక్షలు సమకూర్చాడని వేం కృష్ణకీర్తన్ పిటిషన్ ను కొట్టివేసిందట హైకోర్టు. ఓటుకు నోటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్రెడ్డి కుమారుడు వేం కృష్ణకీర్తన్పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈడీ కేసును కొట్టేయాలంటూ వేం కృష్ణకీర్తన్ హైకోర్టులో 2022లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈడీ తరఫు న్యాయవాది ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డికి, ఏ-3గా ఉన్న ఉదయ్ సింహకు రూ.50 లక్షల నగదును వేం కృష్ణకీర్తన్ సమకూర్చడంటూ వాదించాడు. దీంతో వాదనలు విన్న ధర్మాసనం లంచం ఇస్తున్నారని తెలిసిన వేం కృష్ణకీర్తన్ డబ్బులు ఇచ్చాడని పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తరునంలోనే.. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్రెడ్డి కుమారుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి.