నాకు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు. ఇవాళ కరీంనగర్ లో మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ.. యావత్ భారతదేశం లో ఏ పొలిటికల్ పార్టీ కూడా క్యాస్ట్ సెన్సెక్స్ చెస్తానని చెప్పలేదన్నారు. రాహుల్ గాంధీ మాత్రమే బిసి ల గూర్చి మాట్లాడారని చెప్పారు.
జనాభాలో అరవై శాతం ఉన్న బిసిలకి అన్యాయం జరుగుతుందని.. మహిళ డిక్లరేషన్ కూడా ప్రకటిస్తామని ప్రకటించారు. నరేంద్ర మోడి ఓబిసి ప్రధాని అయిన బిసి న్యాయం జరుగడం లేదని.. 0.5 శాతం ఉన్నవారే తెలంగాణ లో పదవులలో ఉన్నారన్నారు. నరేంద్ర మోడి బిసి వ్యక్తి అయిన కుడా బిసిలకి న్యాయం జరుగడం లేదని ఆగ్రహించారు. బిసి మంత్రులకి బిసి గూర్చి అడిగే దమ్ము లేదని… పొన్నం ప్రభాకర్ కి రిక్వెస్ట్ చేస్తున్నా…మీకేమైనా నిరాశ ఉంటే సరిచేస్తామని వెల్లడించారు వీహెచ్.