HCA కార్యాలయం పై విజిలెన్స్ దాడులు.. పలు రికార్డులు స్వాధీనం..!

-

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో హెచ్సీఏ కార్యాలయం పై విజిలెన్స్ మెరుపు దాడులకు దిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై దాడులు నిర్వహించారు. అక్రమ టెండర్లు ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి అన్ని రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో రవాణా, క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇవ్వడంలో కొందరూ హెచ్సీఏ సభ్యులు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. హెచ్సీఏ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు సమాచారం.

క్యాటరింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియ యజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ డీజీపీకి గతంలో లేఖ రాసారు. అపెక్స్ కౌన్సిల్ తో సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయాధికారాలు కొంత మంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయని.. టెండర్ లేకుండా ఐపీఎల్ ప్రతిష్టకు భంగం కలిగిస్తామని పేర్కొన్నారు ఎంపీ చామల.

Read more RELATED
Recommended to you

Exit mobile version