ప్రధాని మోడీతో రేవంత్ భేటీ..విజయశాంతి సంచలన ట్వీట్

-

నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీను, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ముగ్గురి సమావేశంపై విజయశాంతి సంచలన పోస్ట్‌ పెట్టారు. ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కనీసం కల్వక, తెలంగాణకొచ్చిన ప్రధానమంత్రి ముఖం చూడక, అహంభావంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిందని ఫైర్‌ అయ్యారు విజయశాంతి.

ఇక నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు వ్యవహరిస్తున్న ప్రజాస్వామ్య, గౌరవ శైలికి ఉన్న విధానపరమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరమున్నదని చురకలు అంటించారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరల్ స్ఫూర్తితో పని చేయటం తప్పక ఆవశ్యకమే నాడైనా నేడైనా.. అంటూ విజయశాంతి పోస్ట్‌ పెట్టారు.

కాగా, ప్రధానిని కలిసిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రయోజనాల స్ఫూర్తితో.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version