సీఎం కేసీఆర్ కుటుంబానికి విజయశాంతి హెచ్చరిక

-

బీఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ కుటుంబం పై విజయశాంతి సంచలన పోస్ట్ పెట్టారు. తెలంగాణ బిడ్డలారా…ఎన్నికలు రానున్నవి సుమారు 10 ఏండ్ల దోపిడి ఇంతదంక చూసిన్రు అంటూ సిఎం కెసిఆర్ కు చురకలు అంటించారు. బీఆర్ఎస్ అధినేత కుటుంబం యొక్క అందరు కలిపి సుమారు 2 లక్షల కోట్లు, తదితర ముఖ్యులు మరో 2 లక్షల కోట్లు దాచుకున్నట్లు (దోచుకున్నట్లు) వార్తలు దినాల కెల్లి తెలంగాణ సమాజంలో ఎల్తునే ఉన్నయి. పంచితే ఆ పైసలు తెలంగాణా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయిలు వాస్తవానికి కావచ్చు అన్నారు.

vijayashanthi on ts assembly elections

మల్లా ఆ బీఆర్ఎస్ దోపిడి కార్యక్రమాన్ని …..తెలంగాణ బిడ్డలను మహిళల్ని కుక్కలు అని (అంటున్న తీరుగ) అవమానించి, అవమానిస్తున్న దొరాహంకారాన్ని ఎల్లగొట్టే స్ఫూర్తి మన గత పోరాటాల యాది మనకు మరోమారు తప్పక నేర్పుతది. ఆ ఉద్యమ ఫలితాల సాధన అమలుకు మల్లా సమాజం కదిలిన నాడు… పుణ్య తెలంగాణ భూమిపుత్రులారా…ధన్య తెలంగాణ ఆడబిడ్డలారా అంటూ ఆసక్తి కార్య వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణ అన్న మన జన్మ పోరాటం, యావత్ తెలంగాణ బిడ్డలకై తప్ప, ఒక్క నియంత కుటుంబానికై మాత్రమే కాదు అన్న నియతి అవగతమైతదన్నారు రాములమ్మ

Read more RELATED
Recommended to you

Exit mobile version