తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. వరదల్లో చాల చోట్ల బైక్లు కొట్టుకపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో కూడా ఈరోజు వర్షం దంచి కొట్టింది. జిల్లా కేంద్రం లో గంటపాటు ఆగకుండా వర్షం పడింది. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. ఆర్మూర్, భీంగల్ లో కురిసిన వర్షానికి చెరువులను తలపించేలా మారాయి రోడ్లు.
ఈ వర్షం దెబ్బకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద పెరిగింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 10680 క్యూసెక్కులు గా ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1080 అడుగుల వరకు నీరు ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం 80 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం 48.07 టిఎంసీల నీరు ప్రాజెక్ట్ లో ఉంది. అలాగే ప్రాజెక్ట్ ఔట్ ఫ్లో ప్రస్తుతం 4200 క్యూసెక్కులు గా ఉంది.