మంగళవారం ఢిల్లీలో రైస్ మిల్లర్ల తో సమావేశం అయ్యారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సమావేశం సందర్భంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎంపీ అరవింద్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల పై బిజెపి ఎంపీ అరవింద్ మాటలు ఖండిస్తున్నామన్నారు.తెలంగాణలో వ్యవసాయం కేంద్రంగా పాలన సాగుతోందన్నారు.48 రోజులుగా సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కొనట్లేదని తెలిపారు.
భారీ వర్షాలకు మిల్లుల్లోని వరి ధాన్యం మొలకలు వస్తోందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.పంట మార్పిడికి సిద్ధమైన రైతులతో వరి వేయించింది బీజేపీ నేతలేనని అన్నారు.బ్యాంకుల్లో అప్పులు తెచ్చి కేసిఆర్ వరి ధాన్యం కొనుగోలు చేశారనీ తెలిపారు.బాయిల్డ్ రైస్ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.కేంద్రం తప్పిదానికి మిల్లర్లు రోడ్లపైకి వస్తున్నారనీ అన్నారు.రైస్ మిల్లర్ల పై బీజేపీ ఎంపీ అరవింద్ మాటలు ఖండిస్తున్నామన్నారు.