వారందరికీ వడ్డీలేని రుణాలు ఇప్పిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

-

మూసి పైన అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మూసి ప్రక్షాళన కోసం మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. హైదరాబాదును విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చెరువులను మూసి ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు. తెలిసో తెలియకను కొందరు మూసిలో ఇండ్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు.. అలాంటి పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశం. పడగొట్టాలని కాదు అని చెప్పారు. మూసి రివర్ బెడ్ లో ఉన్న అక్రమకు నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇప్పటికే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్టు గుర్తు చేశారు. అంగన్వాడి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆరేళ్లపాటు వారిని చదివిస్తామని స్వయం సహాయక మహిళా గ్రూపులతో వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు. పునరావాసం కోసం హై లెవెల్ కమిటీ పని చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రివర్ పేట్ గుర్తించే నివాసాలకు కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితుల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు అని చురకలు అంటించారు మంత్రి శ్రీధర్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version