జర్నలిస్టు రేవతి, తన్వీ యాదవ్‌లను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, వారిని ఎక్కడకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియరాలేదు. అరెస్ట్ చేసి ఆరు గంటలు అవుతున్నా ఇంకా జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్‌ల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
అరెస్టు చేశారా? లేక కిడ్నాప్ చేశారా? అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రేవతి తరఫు లాయర్ సీసీఎస్ చేరుకుని అక్కడ వాకబు చేయగా తమకేమీ తెలియదని పోలీసులు చెప్పడం గమనార్హం. దీంతో బషీర్‌బాగ్ సీసీఎస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత ఫైట్ చేసినా, ప్రశ్నించినా.. మహిళలను సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తరువాత అరెస్ట్ చేయొద్దని నియమాలు ఉన్నా.. పోలీసులు అవేమీ పట్టించుకోకుండా కిడ్నాప్ తరహాలో వీరిద్దరిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పకపోవడం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
https://twitter.com/TeluguScribe/status/1899698827801583760