తెలంగాణలో ఎవరు శుభకార్యం చేసుకోవద్దా..? : సబితా ఇంద్రారెడ్డి

-

తెలంగాణలో ఎవరు శుభకార్యం చేసుకోవద్దా..? అని మాజీ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజాగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజ్ పాకాల సొంత ఇళ్ళు కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నారని తెలిపారు. లీసు కుటుంబాలు రోడ్డు ఎక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదు. కానీ రాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారు.

సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో పండుగలు వచ్చినప్పుడు దావత్‌లు చేసుకోవడం కామన్  అన్నారు. ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదు అన్నారు. వాస్తవానికి  తెలంగాణలో శుభకార్యం జరిగితే ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారు. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాల లేవు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version