పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఏ ప్రభుత్వం అయినా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఆయన మాట్లాడారు. దిగిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా..? అని ప్రశ్నించారు. పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా..? ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధి, విధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి సహేతుక సలహాలు ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. 

Harish

మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపైనా సీఎం రేవంత్ రెడ్డి  సెన్షేషన్  కామెంట్స్ చేశారు. అసలు కాలేశ్వరం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కుక్క తోక తగిలి పందిరి కూలినట్టుగా కాళేశ్వరం పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. ఊళ్లమీద పడి మాట్లాడటం కాదని, ప్రాజెక్టులపై లెక్కలు తీయడానికి కేసీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version