మహాలక్ష్మి స్కీమ్.. 24 రోజుల్లో 2.50 కోట్ల మంది మహిళా ప్రయాణికులు

-

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాని మహిళల నుంచి భారీ స్పందన వస్తోంది. మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత ప్రయాణంతో టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రోజూ 9 నుంచి 10 లక్షలు మించని ప్రయాణాలతో ఉన్న జోన్‌లో డిసెంబరు 9 నుంచి మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికులు భారీగా పెరిగారని తెలిపారు.

“ప్రస్తుతం రోజూ 18 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది. గతంలో 4.50 లక్షలు ఉన్న మహిళా ప్రయాణికులు ఇప్పుడు 10 లక్షలు దాటారు. ఉచిత ప్రయాణాలు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 2.50 కోట్ల మంది  మహిళా ప్రయాణికులు సిటీ బస్సుల్లో ప్రయాణించారు.” అని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బస్సుల సంఖ్యను పెంచుకునే పనిలో పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version