మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టుపై ఆరు పేజీల లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను సరిగ్గా పరిశీలించకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండానే హడావుడిగా నివేదిక ఇచ్చారని లేఖలో వివరించింది. వాస్తవాలకు విరుద్ధంగా NDSA రిపోర్టు ఉంది.. నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆగ్రహించింది ప్రభుత్వం.
అసలు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను NDSA నిపుణులు సందర్శించనే లేదు… వాటి మీద ఎలా నిరాధార వ్యాఖ్యలు చేసారని పేర్కొంది. లక్ష్మీ బ్యారేజీ విఫలమవడానికి గల కారణాలపై కమిటీ ఎలాంటి పరిశోధనా పని లేకుండానే తీర్మానాలు చేయడం మాకు ఆశ్చర్యం కలిగిస్తోందని వివరించింది తెలంగాణ ప్రభుత్వం. అటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి నిపుణుల కమిటీ రెండు బ్యారేజీలను కూడా సందర్శించలేదన్న వ్యాఖ్యలు నిరాధారమని కేంద్ర బృంద అధికారులు చెబుతున్నారు.