లవర్​కు పిజ్జా ఇచ్చేందుకు వెళ్లిన యువకుడు.. అంతలో ఆమె తండ్రి ఎంట్రీ.. భయంతో బిల్డింగ్​పై నుంచి దూకి..

-

తన లవర్​కు పిజ్జా ఇంచ్చేందుకు రాత్రిపూట ఆమె ఇంటికి వెళ్లాడు. టెర్రస్​పైన ఆమతో ముచ్చట పెడుతుండగా.. అకస్మాత్తుగా అక్కడికి ఆమె తండ్రి రావడం గమనించాడు. వెంటనే నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. ఈ సంఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బోరబండ ప్రాంతంలోని ఓ బేకరీలో పనిచేసే షోయబ్‌ (20)కు స్థానిక యువతితో ప్రేమలో పడ్డాడు. శనివారం రాత్రి తనకు పిజ్జా కావాలని యువతి అడగ్గా.. షోయబ్‌ అర్ధరాత్రి పిజ్జా తీసుకొని  యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో షోయబ్‌ ఆమెతో టెర్రస్‌పై మాట్లాడుతున్నాడు. యువతి తండ్రి మేడపైకి రావడంతో.. భయపడిన షోయబ్‌ నాలుగో అంతస్తుపై నుంచి దూకేశాడు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ షోయబ్‌ ఆదివారం రాత్రి మృతి చెందాడని బోరబండ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version