ఆహారం ఇవ్వలేదని యువతిని కొందరు యువకులు దారుణంగా దాడి చేసినట్లు తెలిసింది. అమ్మాయి అని చూడకుండా తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన మేడ్చల్ PS పరిధిలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. ఓ దాబాకు బండ మైలారానికి చెందిన యువకులు వచ్చారు. ఆహారం అడిగితే ఇవ్వలేదని అందులో పనిచేస్తున్న యువతిపై కొందరు యువకులు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ‘రాడ్లతో యువతి తల పగలగొట్టారు. స్పూన్లతో గుచ్చుతూ నరకం చూపించారు’. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కాగా, నిందితులు బాధితురాలి వద్ద బంగారం, వాళ్ల డాడీ చైన్ దోపిడీ చేసినట్లు కూడా సమాచారం.
యువతిని దారుణంగా కొట్టిన యువకులు
అమ్మాయి అని చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. ఓ దాబాకు బండ మైలారానికి చెందిన యువకులు వచ్చారు. ఆహారం ఇవ్వలేదని యువతిపై దాడి చేశారు. 'రాడ్లతో యువతి తల పగలగొట్టారు. స్పూన్లతో గుచ్చుతూ నరకం… pic.twitter.com/PUjf0C6Ywg
— ChotaNews App (@ChotaNewsApp) April 3, 2025