నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు షర్మిల.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో భేటీ కానున్నారు. తమిళిసైను కలిసి షర్మిల.. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలన, వైఫల్యాలపై వినతి పత్రం ఇవ్వనున్నారు. గవర్నర్​ను కలిసిన అనంతరం రాజ్​భవన్ నుంచే వై.ఎస్.షర్మిల నేరుగా పాదయాత్ర కోసం నర్సంపేట నియోజకవర్గానికి బయలుదేరుతారు.

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వై.ఎస్.షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. గతంలో ఆపేసిన ప్రాంతమైన వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజక వర్గంలో చెన్నారావుపేట మండలం శంకరమ్మతండా నుంచి షర్మిల తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు నెక్కొండలో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version