తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని.. నిరంతరాయంగా సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు మంత్రి గంగుల.
ఈ నెల నుండి డిసెంబర్ వరకూ ఉచిత బియ్యం అందిస్తామని.. 18 నుండి 26 వరకూ 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. 40 కోట్ల 63 లక్షల ధాన్యం బ్యాగుల్లో ఎప్.సి.ఐ సరిగా లేవన్నవి 0.7 శాతమని.. 40 మిల్లుల్లో షార్టేజీ ఉందని మొదట అన్న ఎప్.సి.ఐ తర్వాత తనిఖీల్లో 30 మిల్లులు సరిగానే ఉన్నాయని చెప్పారు. పది మిల్లుల్లో రెండింటిపై క్రిమినల్ కేసులు, మూడింటి నుండి 125 శాతం రికవరి చేసామని.. ఒక్కగింజను వదులకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.