సన్ రైజర్ లో కి తెలుగు కుర్రాడు..!

-

ఐపీఎల్ సీజన్ లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన సన్రైజర్స్ కు మొదటి నుంచీ ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే చీలమండ గాయం కారణంగా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న మిచెల్ మార్ష్ ఏకంగా మొదటి మ్యాచ్లో ఐపీఎల్ కు దూరం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మిచెల్ మార్స్ స్థానంలో కొత్త ఆటగాని పెట్టి జట్టు కోలుకుంటూన్న సమయంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే బౌలింగ్ విభాగానికి ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న భువనేశ్వర్ కుమార్ కుడికాలు తుంటి గాయం కావడంతో మైదానం వదిలి వెళ్లిన విషయం తెలిసిందే.

భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులోకి గాయం నుంచి కోలుకుని తిరిగి వస్తాడు అని అభిమానులు అనుకున్నప్పటికీ పూర్తిగా ఐపిఎల్ కి దూరం అయ్యాడు భువనేశ్వర్ కుమార్. అయితే జట్టుకు దూరమైన భువనేశ్వర్ కుమార్ స్థానంలో తెలుగు కుర్రాడు జట్టులోకి వచ్చినట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ స్థానంలో ఏపీకి చెందిన పృద్వి రాజ్ యర్రా ను జట్టులోకి తీసుకున్నట్లు ఇటీవలే సన్రైజర్స్ తెలిపింది. అయితే గత సీజన్ మొదటిసారి కేకేఆర్ జట్టు తరఫున హైదరాబాద్ తో తలపడ్డాడు. ఇక ఇప్పుడు హైదరాబాద్ తరఫున మిగతా దెబ్బజట్లతో తలపడేందుకు సిద్ధమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version