ఇండో అమెరికన్లకు సారీ చెప్పిన స్వాతి.. ఇంకా ఏమందంటే..

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ నివారణ చర్యల్లో అమెరికా విఫలం అయ్యిందంటూ.. తెలుగు ఎన్‌ఆర్‌ఐ స్వాతి దేవినేని చేసిన ఓ వీడియా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో స్వాతి మాట్లాడుతూ.. కరోనా నివారణ చర్యలత్లో భారత్‌ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. అయితే స్వాతి వ్యాఖ్యలపై పలువురు ఇండో అమెరికన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె వీడియో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని మండిపడ్డారు. ఒక దేశాన్ని పొగటం కోసం.. మరో దేశాన్ని కించడపరచడం సరైనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. పైగా స్వాతిపై అమెరికాలో ఓ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలో తన వీడియోకు సంబంధించి స్వాతి దేవినేని వివరణ ఇచ్చారు. తాను చేసిన వీడియో పట్ల స్వాతి.. ఇండో అమెరికన్లను క్షమాపణ చెప్పారు. ఒక యూట్యూబ్‌ చానల్‌ స్రిప్టును చదివానని.. అది ఎడిటింగ్‌ సమయంలో లీక్‌ అయిందని తెలిపారు. అందులో చెప్పిన అంశాలు తన వ్యక్తిగతమైనవి కావనీ.. అందులో ఎలాంటి కుట్ర కోణం లేదని అన్నారు. ఆ వీడియో చేసినందుకు ఇండో అమెరికన్లను క్షమాపణ కోరారు. ఈ మేరకు స్వాతి ఓ వీడియోను విడుదల చేశారు.

‘ప్రియమైన ఇండో అమెరికన్లను సారీ. నేను చేసిన వీడియో చూసి ఇక్కడున్న భారతీయులు హార్ట్‌ అయ్యారు. ఒకరకంగా వాళ్లు చెప్పింది కూడా కరెక్టే. ఒక యూట్యూబ్‌ చానళ్లు పంపిన స్రిప్టును నేను చదివాను. అయితే ఎడిటింగ్‌ సమయంలో అది లీక్‌ అయింది. అందుకే ఈ విధంగా ట్రోల్‌ అవుతుంది. అందుకే చానల్‌ లోగో కూడా లేకుండా వీడియో బయటకు వచ్చింది. అక్కడి విధానాలతో ఇక్కడి పాలకుల విధివిధానాలన సరిపోల్చుతున్న ఆ స్రిప్టు నా పర్సనల్‌ కాదు. అమెరికా జీవన విధానం ద్వారా భారతీయులు అందరు ఉన్నత శిఖరాలకు చేరారు. వారందరూ ఈ దేశ ప్రగతిలో భాగమై.. నా దేశ ప్రగతిని కూడా వ్యక్తిగతంగా ముందుకు తీసుకెళ్లిన విధానం నాకు తెలియనిది కాదు. ఇది చాలా గొప్ప విషయం. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.

శ్వేతాసౌధపు పాలన పరిమాళాలు మరింతంగా ప్రపంచాన్ని గుర్తించేలా ఉండాలనేదే నా ఆవేదన. అదే నేను వ్యక్త పరిచదలిచాను. అంతేకానీ ఇందులో ఎంతమాత్రం నాదైనా కుట్ర కోణం లేదు. ఎవరినీ కించపరచాలని నేను ఆ వీడియో చేయలేదు నేను పుట్టిన దేశం మీద ఎంత మమకారం ఉందో.. నాకు ఆశ్రయం ఇచ్చిన దేశం మీద నాకు అంతకంటే ఎక్కువ అభిమానం ఉందండి. ఆ వీడియో ద్వారా నాతోటి ఇండో అమెరికన్లు అందరూ చాలా వరకు హార్ట్‌ అయ్యారనే నేను వినడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నది నేనే కాబట్టి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని సారీ చెప్పదలుచుకున్నాను. ఆ వీడియో చేసినందుకు సారీ.. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అని స్వాతి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version