తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి కాలం పూర్తిగా రాకముందే.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. తాజా గా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అలాగే ఆదిలాబాద్ అర్బన్ లో 42.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా లోని కౌటాలలో 42.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో 42.6 డిగ్రీలు, నర్సాపూర్ (జీ)లో 42.5 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10 గంటలు అయిందంటే.. ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొద్ది సేపు ఎండలో ఉంటే అస్వస్థతకు గురి అవుతున్నారు. కాగ ఈ రోజు జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా అస్వస్థతకు గురి అయ్యారు. ఎండలో ఎక్కువ సేపు ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయారు.
కాగ ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఈ రోజు కల్యాణ లక్మీ, సీఎం సహాయ నిధి చెక్కులను ఇంటి ఇంటికీ తిరిగి పంపిణీ చేశారు. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తర్వాత ప్రకటించారు.