అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలపై ఉత్కంఠ కొనసాగతూనే ఉంది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. పరీక్షలపై సుప్రీం నోటీసులు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొదటి నుంచి తమ స్టాండ్ ఒక్కటేనన్నారు. ఒక వేళ నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.