టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసు విచారణ అనేది పదేళ్ల నుంచి కామెడీ…ఫార్స్ అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసును ఇప్పటికీ అయిన త్వరగా తేలిస్తే మంచిదని.. కొంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నారేమో…తెలియదు కదా ? అని తెలిపారు. నాకు తెలిసి సినీ పరిశ్రమలో డ్రగ్ పెడలర్స్ ఉండరు…యూజర్స్ ఉంటే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
విచారణ జరిగినన్ని రోజులు ఆ 10 మంది ఇబ్బంది పడతారు…ఆ తర్వాత మాములేనని చురకలు అంటించారు. డ్రగ్స్ వాడడం తప్పు…డ్రగ్స్ వాడుతున్నారేమో తెలియదని పేర్కొన్నారు.. విచారణ పూర్తి చేసి త్తప్పని తేలితే శిక్ష వేయాలి…లేదంటే వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. తొందరగా తేల్చకుండా ఉంటే విచారణ అన్నప్పుడల్లా.. వాళ్లకు ఫ్యామిలీలు ఉంటాయి..ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను మరోసారి డ్రగ్స్ కేసు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో భాగంగా నిన్న సాయంత్రం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్లకు ఐటి నోటీసులు జారీ చేసింది.