వేయి సంవ‌త్స‌రాల ఆ గుడిలో అన్నీ అంతుచిక్క‌ని మిస్ట‌రీలే..

-

త‌మిళ‌నాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం వేయి సంవత్సరాల పురాతనమైనక్షేత్రం. ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. భారతదేశంలోని అతిపెద్ద శివలింగంఉన్న క్షేత్రం. అయితే ఈ ఆలయంలో చాలా మిస్టరీలు దాగి ఉన్నాయి.. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి..

పదమూడు అంతస్థుల గోపురం కలిగి ఉన్న ఏకైక పురాతన క్షేత్రం.  ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. ప్రస్తుతం రాతికి సంబంధించి గ్రానైట్ కన్నా ధృఢమైనది లేదు. కానీ ఈ కట్టడం వేయి సంవత్సరాల క్రితమే. ఎనభై టన్నుల ఏక శిలతో చేసిన గోపుర కలశం పదమూడు అంతస్థులపైన ఎటువంటి వాలు లేకుండా నిలబెట్టడం ఒక మిస్టరీ. ఈ ఆలయాన్ని క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేశారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం.

మిట్ట మధ్యాహ్నం ఈ గోపురపు నీడ ఎక్కడా పడదు. ఇలా అన్ని కాలాలలోను మనం చూడవచ్చు. గోపుర ఆకారం.. కలశ ఆకారం.. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడ మోపడం చాలా నైపుణ్యానికి ప్రతీక.  గుడిలోపల `ప్రతిధ్వని` ఉండదు. మనం మాట్లాడిన మాటలు మనకు తిరిగి వినబ‌డ‌క‌పోవ‌డం ప్ర‌త్యేకం. ఆలయం లోపల చాలా సొరంగ మార్గాలున్నాయి. ఇవి తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారిగా ఉంటే… కొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులను కలిగి ఉన్నాయని అన్ని దారులను మూసివేశారు.

 

బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటి. ఇది నిజంగానే 8.7 మీటర్ల ఎట్టు 5 మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం. అంత పెద్ద శివ లింగానికి నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారు మాత్రమే దర్శించుకునే వారు. సామాన్య జనులకు ప్రవేశం ఉండేది కాదు. తర్వాత్తరాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునేందుకు అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version