తనకు కంగ్రాట్స్ చెబుతూ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘సీఎం గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వ సూచనలతో మంత్రుల సమష్టి కృషితో సమాజంలోని అన్ని వర్గాల పురోగతికి పాటుపడతాం అని పేర్కొన్నారు. సుసంపన్న ఏపీ కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.
కాగా, డిప్యూటీ సీఎంగా నియమితులైన పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కంగ్రాట్స్ చెప్పారు. ‘మంత్రివర్గంలో వివిధ శాఖలు పొందిన నా సహచరులందరికీ అభినందనలు. అందరం రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు కృషి చేస్తారనే నమ్మకం నాకుంది. నూతన ప్రయాణంలో మరోసారి అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.