ఆ బౌలర్ నా కంటే 1000 రెట్లు బెటర్‌ : కపిల్ దేవ్

-

కపిల్ దేవ్‌.. ఇండియా క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇండియాకు తొలి వరల్డ్‌కప్‌ను అందించిన కెప్టెన్‌గా కపిల్ దేవ్ చ‌రిత్ర సృష్టించాడు. ఇండియన్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన కపిల్ దేవ్‌.. తన కంటే అద్భుతమైన బౌలర్‌ ఉన్నాడని అన్నారు.అతడే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రాపై కపిల్ ప్రశంసల జల్లు కురిపించాడు. “బుమ్రా ఒక అద్బుతమైన బౌలర్‌. జస్ప్రీత్ నా కంటే 1000 రెట్లు బెటర్‌. ప్రస్తుత తరం క్రికెటర్లలో చాలా మంది నైపుణ్యం కలిగిన వారే ఎక్కువ ఉన్నారు.

మాకు అనుభవం ఉంది. కానీ వారు మాకన్న చాలా ఎక్కువ పరిణితి చూపిస్తున్నారు అని తెలిపారు. అదేవిధంగా మాకంటే ఫిట్‌గా ఉన్నారు. మాకంటే ఎక్కువగా కష్టపడతారు కూడా. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా ప్రతీ ఒక్కరూ తమ పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు. ట్రోఫీని గెలవడమే వారి లక్ష్యమని” ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.కాగా టీ20 ప్రపంచకప్ లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 8 వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version