ఆ నగరానికి వ్యాక్సిన్ అవసరం లేనట్టేనా..?

-

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తుంది. ఆరు నెలలు కావొస్తున్నా కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో ఆ భయం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో అందరూ ఎదురుచూస్తున్నది వ్యాక్సిన్ కోసమే. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటామా అని చూస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేలా కనబడట్లేదు. ఈ నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినా బాగుండని అనుకుంటున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే ఎక్కువ మంది జనాభాకి కరోనా సోకి ఉండాలి. కనీసం 60శాతం జనాభా కరోనా బారిన పడాలి.

అయితే బ్రెజిల్ లోని మానస్ నగరం హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువలో ఉన్నట్తు వినిపిస్తుంది. ఆ నగరంలో 66శాతం జనాభా కరోనా బారిన పడ్డారు. మహమ్మారి మొదలైన రోజుల్లో వేలసంఖ్యలో కేసులు వచ్చాయి. ఇప్పుడు సగం కంటే ఎక్కువ జనాభాకి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో 34మంది పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం మానస్ నగరం హెర్ద్ ఇమ్యూనిటీకి చేరువలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయట. సుమారు 22లక్షల జనాభా ఉన్న మానస్ నగరంలో కరోనా కారణంగా 2462మంది చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version